Parliament Sessions: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సెషన్స్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎనిమిది బిల్లులను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనుంది.
ప్రధాని ధన్‌ధాన్య కృషి యోజన పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూరేలా ఏడాదికి 24,000 కోట్ల రూపాయలు అందజేస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
Amit Shah: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యంలో రామమందిరాన్ని నిర్మించారని, దేశంలోకి 5జీని తీసుకువచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్నవారు రామమందిరాన్ని నిర్మించడం వల్ల ఏమి మంచి జరిగిందని అడుగుతారు. వారికి అర్థం కాకపోవచ్చు.
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, మాజీ బీజేపీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన శ్రీ కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహం ఫిల్మ్‌నగర్ నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ…
PM Modi: రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. సమాజానికి వారు చేసిన సేవలు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరిగింది. ఖాళీల భర్తీ నేపథ్యంలో వీరి నామినేషన్ జరిగింది. నామినేట్ చేసిన వారిలో ఉజ్వల్ నికమ్, సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ ష్రింగ్లా, డా. మీనాక్షి జైన్ లు ఉన్నారు. ఇక వీరి వివరాలు పరిశీలిస్తే.. Read Also:Kollu Ravindra: పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు. ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రదానం చేసింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రధానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా మోడీకి ఈ పురస్కారాన్ని అందించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి దేశమైన నమీబియాలో ప్రధాని పర్యటిస్తున్నారు.
మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని ఆరోపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది.
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.