Nag Ashwin : కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ.100 వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతం వరకు తగ్గించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రధానమంత్రి మోడీకి కీలక సూచనలు చేశాడు. రూ.100లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీని తగ్గించడం చాలా మంచి విషయం అని.. కాకపోతే రూ.250 వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుండేదని అన్నాడు.
Read Also : Allu Arjun : దుబాయ్ లో దిగిన ఐకాన్ స్టార్..
ఎందుకంటే రూ.100 థియేటర్లు చాలా తక్కువగా ఉన్నాయని.. రూ.250 టికెట్ ధరల్ ఉండే థియేటర్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. మిడిల్ క్లాస్ వాళ్లు వచ్చే థియేటర్లే ఎక్కువ అని.. వాటిపై జీఎస్టీని తగ్గిస్తే వాళ్లకు మేలు జరిగేదన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ ధరల ఇష్యూపై మొన్నటి దాకా ఎంత రచ్చ జరిగిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి-2 సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్