దేశ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు.
India-UK trade deal: భారత్, యునైటెడ్ కింగ్డమ్(యూకే)ల మధ్య అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)’’ కుదిరింది. గురువారం మైలురాయిగా నిలిచే ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్ సంతకాలు చేశారు. 2020లో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి యూకే నిష్క్రమించిన తర్వాత, ఆ దేశం చేసిన అతిపెద్ద ఒప్పందం ఇదే. లండన్‌లో మోడీ, స్టార్మర్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత…
ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు చివరిలో గానీ.. సెప్టెంబర్ ప్రారంభంలో గానీ SCO సమ్మిట్ కోసం చైనా, జపాన్ కూడా సందర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం బుధవారం లండన్ చేరుకున్నారు. గురువారం యూకేతో భారత్ కీలక ఒప్పందం జరగనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం ఈసీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోవైపు అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ మేధావి అని.. యూపీఏ-2లో మన్మోహన్ సింగ్.. పదని పదవిని ఆఫర్ చేస్తే రాహుల్ గాంధీ కొన్ని సెకన్లలోనే తిరస్కరించారని గుర్తు చేశారు.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమరం మొదలైపోయింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి-మార్చి మధ్యలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో విపక్షాలకు కూడా మాట్లాడటానికి అవకాశం ఉండాలి అని డిమాండ్ చేశారు. సభలో నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను.. రక్షణ మంత్రి, ఇతరులు మాట్లాడతారు.. కానీ, విపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వలేదు అని మండిపడ్డారు.