భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
Kartavya Bhavan 3 Inaugurate: దేశ రాజధాని న్యూఢిల్లీలో అధికార పరిపాలనకు మౌలిక భద్రతను అందించేందుకు రూపొందించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాల్లో ఒక్కటైన కర్తవ్య భవన్-3ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 6) అధికారికంగా ప్రారంభించారు. ఇది మొత్తంగా 10 భవనాల సముదాయ నిర్మాణం. ప్రస్తుతం ఢిల్లీలో విస్తరించి ఉన్న గృహ, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ లఘు మధ్య పరిశ్రమలు (MSME), డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT), పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్,…
ఆపరేషన్ సిందూర్పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు ఎంతగానో బాధించిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వరుస భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆదివారం గంట వ్యవధిలోనే ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Malegaon blast case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ను ఎన్ఐఏ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ATS) తనను తీవ్రంగా హింసించిందని బీజేపీ మాజీ ఎంపీ ఆరోపించింది. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఏడుగురు నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆధారాలు లేవని చెప్పింది.
PM Modi: ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు.
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పదవి నాకు వద్దని చెప్పలేదు, కావాలని నేను అధిష్టానాన్ని అడగలేదన్నారు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది..
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు.. ఆ 15 సీట్లు లేకుంటే ప్రధాని పదవి మోడీకి దక్కేది కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట పెడుతాం..మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు NSA జోక్యం చేసుకున్నాయి.. దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాహుల్ గాంధీ తెలియజేశారు.
Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.