దేశం తెలంగాణ వైపు చూసేవిధంగా విద్యాశాఖను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు
హైదరాబాద్ దోమలగూడలో 20 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఫిజికల్ ఎడ్యుకేషన్ బాలికల వసతి గృహా సముదాయం భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. దోమలగూడలోని వ్యాయామ కళాశాలలో 20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన హాస్టల్, అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ భవన సముదాయ పనులకు సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్, వెల్ఫేర్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ దేవికారాణి, కళాశాల ప్రిన్సిపాల్ కె.రాంరెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దే స్థాయికి వ్యాయామ విద్య కోచింగ్ కళాశాల ఎదగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 20 కోట్ల కేటాయించడంపై ఆమె ధన్యవాదాలు తెలిపారు… భవన నిర్మాణానికి అదనపు నిధులు అవసరమైన ప్రభుత్వం తరఫు నుండి అందించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
కన్హయ్యలాల్ తల నరికి చంపితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది.
కాంగ్రెస్ పార్టీ, అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో దారుణంగా మతోన్మాదులు చేతిలో హత్యకు గురైన కన్హయ్య లాల్ అంశాన్ని మోడీ ప్రస్తావించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తోర్‌గఢ్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. శాంతిభద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘ఉదయ్‌పూర్ లో ఏం జరిగింది.. అలాంటివి జరుగుతాయని ఎవరైనా ఊహించారా..? బట్టలు కుట్టించుకునే నెపంతో వచ్చి గొంతు కోసి చంపారు.’’ అని కన్హయ్యలాల్ హత్య ఉదంతం గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. కన్హయ్యలాల్ దారుణహత్య విషయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని ప్రధాని ధ్వజమెత్తారు. హత్య జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.
ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకు రావడం ఆశ్చర్య మేస్తోంది..
ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకు రావడం ఆశ్చర్య మేస్తోందని తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన లక్షల కోట్ల అవినీతి బయట పెట్టాలని ఆమె అన్నారు. నువ్వు, నీ అక్క దోపిడీ వర్గానికి చెందిన పచ్చి అవకాశవాదులంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఇద్దరు అవినీతి అనకొండలకు కొమ్ము కాయడానికి బస్సు యాత్ర మొదలు పెట్టావా అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు.
స్వర్ణ దేవాలయంలో గిన్నెలు శుభ్రం చేసిన రాహుల్
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సందర్శించారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ ఒక సాధారణ భక్తుడిలా ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తలకు బ్లూ స్కార్ఫ్ దరించారు. అనంతరం స్వచ్ఛంద సేవల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఇతర భక్తులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉపయోగించిన గిన్నెలను రాహుల్ శుభ్రపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అనంతరం భజన బృందం సభ్యులతో కలిసి గుర్బానీ కీర్తనలు విన్నారు.
డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు విప్పితే.. సంగీత ప్రియులు పరవశించిపోతారు. ఇక అదే గొంతు చిన్మయి ఆడవారికి అండగా విప్పితే.. కామాంధులు భయపడిపారిపోవడమే. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలు.. వేటిని ఆమె ఈజీగా తీసుకోదు. విమర్శించినవారిని ఆమె ఊరికే వదలదు.. అందరి ముందు కామాంధుల నిజస్వరూపాన్ని ఎండగడుతుంది. తాజాగా ఒక నెటిజన్ నిజస్వరూపాన్ని ఆమె బయటపెట్టింది. ఒక వ్యక్తి.. ఆమెతో ఎంతో వల్గర్ గా మాట్లాడాడు. ముందుగా మంచి వ్యక్తిలా పరిచయం చేసుకొని.. ” మీరంటే మాకు చాలా ఇష్టం.. ఆడవారి కోసం మీరు నిలబడిన తీరు ఆకట్టుకుంటుంది. మా చెల్లి కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది ” అని మాట్లాడేవాడట. కానీ ఆ మెసేజ్ లకు చిన్మయి రిప్లై ఇవ్వకపోవడంతో అతడిలోని నిజస్వరూపం బయటపెట్టాడని చిన్మయి చెప్పుకొచ్చింది.
ఇండియాలో 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్ బ్యాన్..
మెసేజింగ్ ఫ్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇండియాలో ఆగస్టు నెలలో 74.2 లక్షల అకౌంట్లపై బ్యాన్ విధించింది. 2021 కొత్త ఐటీ రూల్స్ ఆధారంగా వాట్సాప్ ఈ ఖాతాను నిషేధించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎలాంటి రిపోర్టు రాకముందే ముందస్తుగా 35 లక్షల ఖాతాలను బ్యాన్ చేశారు. సెప్టెంబర్ నెలలో మెటా యాజమాన్యం 72.28 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 3.1 లక్షల ఖాతాలు ముందస్తుగా నిషేధించబడ్డాయి.
సొంత గడ్డ నుంచే రైలు ఎక్కే సమయం.. రేపే సిద్దిపేట రైలు కూత షురూ..
సిద్దిపేట జిల్లా వాసులు సొంత భూమి నుంచి రైలు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల.. నెరవేరేందుకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. రైలు అనే మాట వినని ఈ ప్రాంత ప్రజలు.. అది సాకారమైన తరుణంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఉన్న చాలా మందికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ – కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రహదారిలో కీలక మైలురాయి మంగళవారం ప్రారంభం కానుంది. సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు పుష్ పుల్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రధాని మోదీ నిజామాబాద్ నుంచి వర్చువల్ జర్నీ ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. తాజాగా ఈ మార్గంలో రెండు రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గం నాలుగు జిల్లాలను కలిపే ముఖ్యమైన మార్గం.
భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు!
భారత్‌తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక మ్యాచ్‌లోనూ ఓడిపోయి విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ప్రదర్శనపై మొయిన్ ఖాన్ స్పందించాడు.
బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. భయంతో ఉచిత సిలిండర్లు ,సన్న బియ్యం రేషన్ , రైతు లకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పనైపోయింది ,ప్రభుత్వం లో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. టిక్కెట్ ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుందని అన్నారు. టిక్కెట్ ల ప్రకటన నాటి కి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలు మా పార్టీ లోకి వస్తున్నారంటేనే మా బలం ఏంటో అర్దం అవుతుందని అన్నారు.
దుషారా విజయన్‌కు వెల్‌కమ్ చెప్పిన జై భీమ్ డైరెక్టర్..
సూపర్‌స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా భారీ విజయం సాధించింది. రజనీకాంత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా జైలర్ సినిమా నిలిచింది. జైలర్ సినిమా ఇచ్చిన ఊపుతో ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రజనీ చేస్తున్న సినిమాలలో జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ డైరెక్షన్‌లో నటిస్తున్న తలైవా 170 ఒకటి.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. జైలర్ సినిమాకు అద్భుతంగా మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు..ఈ సినిమాలో దుషారా విజయన్ కీలక పాత్రలో నటిస్తోంది. టీంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేస్తూ ఓ స్టిల్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ దుషారా విజయన్ ఇందులో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది తెలియాల్సి వుంది..
కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే..
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను విడిచి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ గతంలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారు. మళ్ళీ ఇప్పుడు హామీలతో మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు .. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే ఈ నాయకులను నమ్మకండి అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, గ్యారంటీలు ఉత్తుత్తి హామీలే అని ఆరోపించారు. కల్లబొల్లి మాటలతో గ్యారెంటీగా అభివృద్ధి చేస్తాం అని మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్మకండి అని ఆయన సూచించించారు.
చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మహాత్ముడి జయంతిన దీక్ష చేస్తాడట.. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర ఉద్యమం మీద అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయడంటూ మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ విమర్శించారు. మహాత్ముడి జయంతిని వాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆయన అన్నారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన దొంగ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. న్యాయస్థానాలే జైలుకి పంపిన వ్యక్తి ఇవాళ దీక్ష చేయటం నీతిబాహ్యమైన పని అంటూ పేర్కొన్నారు.
ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్.. ఐసిస్ మాడ్యూల్తో సంబంధాలు
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్టు సమయంలో నిందితుల దగ్గర నుంచి ఐఈడీ తయారీకి ఉపయోగించే లిక్విడ్ కెమికల్ సహా పలు కీలక సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. మహ్మద్ షానవాజ్ తలపై రూ.3 లక్షల రివార్డు ఉంది.