Tirumala: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఈ రోజు తెలంగాణకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యలో తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. మూడు రోజుల పాటు తెలంగాణలో పీఎం పర్యటన కొనసాగనుండగా.. ఈ నెల 26వ తేదీన సాయంత్రానికి తిరుమల వెళ్లి.. 27న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.. అయితే, ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా.. భద్రతా ఏర్పాట్లలో మునిగిపోయారు పోలీసులు.. ఇక, తిరుమల శ్రీవారి నడకదారిలో ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతిచెందారు. ప్రధాని మోడీ తిరుమల పర్యటనలో భాగంగా భద్రతా విధుల్లో భాగంగా తిరుమలకు వెళ్లారు డీఎస్పీ కృపాకర్. ఈ రోజు ఉదయం మెట్ల మార్గాన్ని పరిశీలిస్తుండగా.. 1,805 మెట్టు వద్ద గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు కృపాకర్.. వెంటనే అప్రమత్తమైన ఆయనతో ఉన్న పోలీసులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచినట్టుగా చెబుతున్నారు. డీఎస్పీ కృపాకర్ స్వస్థలం వియవాడ సమీపంలోని పోరంకి కాగా.. ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వచ్చి తిరుమలలో మృతి చెందారు.
Read Also: DK. Shivakumar: కేసీఆర్ అబద్ధాల కోరు.. రైతులకు సరిపడా కరెంట్ ఇస్తున్నాం..