PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
సామాజిక పోరాటంలో ఒక ప్రధాని మోడీ పాల్గొనడం చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచి పోతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ మాదిగల సమస్యను అర్థం చేసుకుని కమిట్ మెంట్ తో మాట్లాడారు.. వాళ్ళ పోరాటం ఎవరికో వ్యతిరేకం కాదు.
నవంబర్ 17న చత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు.
Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
PM Modi Celebrate Diwali 2023 with Indian Security Forces: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని.. సైనికులతో కలిసి అక్కడ వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ప్రధాని.. సైనికులతో ముచ్చటిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ధైర్యవంతమైన భారత…
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు.
ఎన్డీయే ప్రభుత్వ తొలి లక్ష్యమే పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నానన్న ప్రధాని మోడీ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందన్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతోంది. విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల నినాదాలు మారుమ్రోగాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకున్న ప్రధాని మోడీకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.