ఒక దశాబ్ద కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా సాధించలేని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఆదివారం అస్సాం రానున్న సింగర్ జుబీన్ గార్గ్ భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు
ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు వారిని జవాబుదారీగా చేస్తారని పేర్కొన్నారు. 16 వేర్వేరు పన్నులను ఒకే చట్రంలోకి ఏకీకృతం చేసి.. వ్యవస్థను మరింత పౌర కేంద్రీకృతం చేసేందుకు జీఎస్టీ విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు.. ఖతార్ దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి
ప్రజాస్వామ్యం, పాలన, జాతీయ భద్రత, విదేశాంగ విధానం, జీఎస్టీ సంస్కరణలు ఇలా ఎన్నో మోడీ నాయకత్వంలో జరిగాయని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు ఉపయోగించే భాష మాత్రం ప్రజాస్వామ్య మూలాలను బలహీనపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తులను ప్రజలు జవాబుదారీగా ఉంచాలన్నారు. మోడీ తల్లి గురించి అగౌరవంగా మాట్లాడిన వారిని ప్రజలే శిక్షించాలని అమిత్ షా కోరారు.
మోడీ కారణంగా ప్రపంచ దేశాల సంబంధాలు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చాయన్నారు. ప్రపంచ నాయకులందరితో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలన్నీ కూడా దేశానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. మోడీ 11 ఏళ్ల పాలనలో ఉగ్రవాదాన్ని అరికట్టారని తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే ఉదాహరణ అన్నారు. ఆపరేషన్ సిందూర్, మహాదేవ్ ఆపరేషన్‌లే ఉదాహరణలు అని చెప్పారు.
కోవిడ్-19పై మోడీ ప్రభుత్వం పెద్ద విజయం సాధించిందన్నారు. మహమ్మారిని సమర్థవంతమైన పాలనతో అడ్డుకోగలిగామని చెప్పారు. అలాగే పేదరిక నిర్మూలన కోసం కూడా విశేష కృషి చేశారని స్పష్టం చేశారు. ఇంత గొప్ప విజయాన్ని ఈ పదేళ్లలో మోడీ చేసినట్టుగా ఏ ప్రధానైనా చేయగలిగారా? అని అమిత్ ప్రశ్నించారు.