భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించనున్నారు. ముంబైలోని ఇందిరా డాక్ దగ్గర అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను రూ.7,870 కోట్లతో నిర్మించారు. ఈ టెర్మినల్‌ను మోడీ ప్రారంభించనున్నారు.

ప్రధాని మోడీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని జవహర్ మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా రూ. 34,200 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇందిరా డాక్ దగ్గర ముంబై అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అలాగే కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో కొత్త కంటైనర్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ఇక గుజరాత్‌లో కూడా పలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ, పట్టణ మౌలిక సదుపాయాల రంగాల్లో భాగంగా.. భావ్‌నగర్‌లోని సర్ టి. జనరల్ హాస్పిటల్, జామ్‌నగర్‌లోని గురు గోవింద్ సిన్హ్ ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణలకు పునాది రాళ్ళు వేయనున్నారు. రాష్ట్రంలో కనెక్టివిటీ, వాణిజ్య మార్గాలను మెరుగుపరిచే 70 కిలోమీటర్ల జాతీయ రహదారులను నాలుగు లేన్లను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
#WATCH | Gujarat | PM Modi conducts a roadshow in Bhavnagar
(Source: ANI/DD) pic.twitter.com/zSRMrA3fwc
— ANI (@ANI) September 20, 2025