PM Modi to hand over World Cup 2023 Trophy to winning captain: అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ 2023 తుది పోరు జరగనుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకోగా.. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై అతి కష్టంమీద గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది.…
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్‌లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు.
ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ప్రధాని మోదీ చీఫ్ గెస్టుగా వస్తున్నారట. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు.
Shehla Rashid: ఒకప్పుడు ప్రధాని నరేంద్రమోడీని విపరీతంగా వ్యతిరేకించే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ ప్రస్తుతం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీకి, హోమంత్రి అమిత్ షాలకు థాంక్స్ చెప్పారు. గతంలో తాను కాశ్మీర్ లో రాళ్లు విసిరే వారిపై సానుభూతితో వ్యవహరించానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని షెహ్లా రషీద్ అన్నారు.
జార్ఖండ్ పర్యటనలో భాగంగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సుమారు 7200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇక, ఉలిహతు నుండి వికాస్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు నేడు బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు 2000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఝార్ఖండ్ లోని కుంటిలో ఇవాళ (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రధాన…
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది.