గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్‌కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ చదవనున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందన్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. పలువురు తమ ప్రయాణాలు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. దీంతో ఆ దేశ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. భారత్ పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని హితవు పలికాయి. మోడీకి, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్…
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలంటూ ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇకపై ఎన్నికలు జరగవని అన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అప్రమత్తమై ఓటేయాలని కోరారు. మోడీ గనుక మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని…
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు…
5వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసిద్ధ దేశభక్తి గీతం 'దేశ్ రంగీలా'ను పాడినందుకు ఈజిప్టు అమ్మాయి కరీమాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు. ఇండియా హౌస్‌లో జరిగిన వేడుకలో కరీమాన్ ఈ పాటను అందించారు. ఆమె ప్రదర్శనకు భారతీయులు, ఈజిప్షియన్ల నుంచి ప్రశంసలు లభించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులతో పరీక్షల(పరీక్షా పే చర్చ 2024) గురించి చర్చించారు. పరీక్షల టెన్షన్‌ను తొలగించేందుకు విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రధాన మంత్రి అనేక ఉదాహరణలు ఇవ్వడం ద్వారా పిల్లలను ప్రేరేపించారు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Pariksha Pe Charcha: పిల్లల రిపోర్ట్ కార్డ్స్‌ని తమ సొంత విజిటింగ్ కార్డుగా పరిగణించొద్దని ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థుల తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.