త్తగా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పబ్లిక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున ప్రయాణించే మొదటి రైడ్‌లో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు.
Bandi Sanjay: దయచేసి ఆలోచించాలని, అందరి గురించి మోడీ ఆలోచిస్తున్నారని, మీరు పువ్వు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్లి మోడీకీ ఓటేస్తా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
PM Modi: వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా (Election Commissioners) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ ( Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)లను ప్రధాని మోడీ కమిటీ నిన్న ( గురువారం ) నియమించింది. అయితే, తాజాగా వీరు ఈసీఐలో జాయిన్ అయ్యారు. కమిషనర్లుగా ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు.
Kishan Reddy: హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ గెలుపుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది.
దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి తమ బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ) దక్షిణ భారతదేశంలో ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక, ఇవాళ ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోడీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఎన్డీయే కూటమి 400 లోక్ సభ స్థానాలను దక్కిచించుకుంటామనే నినాదం భారతీయ జనతా పార్టీకి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి 400కు పైగా సీట్లు గెలుచుకోవచ్చని తాజా సర్వేలో తేలింది.
తెలంగాణకు బీజేపీ ఏమీ చేసిందో మోడీ ప్రజల ముందు పెట్టబోతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అభివృద్ది మీద, అవినీతి మీద చర్చ లేదు.. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు విపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మరక లేకుండా మోడీ పాలన చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 15 రోజులుగా లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.. కశ్మీర్…
మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు.. త్రివేంద్ర సింగ్ రావత్ నుంచి బసవరాజ్ బొమ్మై వరకు బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర పెద్దలను లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దింపుతోంది బీజేపీ.
ఢిల్లీ మెట్రో ఫేజ్ 4కు గురువారం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్న ఆయన మెట్రో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు.