లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కచ్చతీవు ద్వీపం అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. 1974లో ఆ ద్వీపాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. శ్రీలంకకు అప్పగించారని కమలం పార్టీ ఆరోపించింది.
Katchatheevu Row: భారత్-శ్రీలంక మధ్య ఉన్న కచ్చతీవు ద్వీపం ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. లంక ఆధీనంలో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే. అన్నామలై ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం కాంగ్రెస్, డీఎంకే పార్టీలను ఇబ్బందుల్లో పడేసింది.
PM Modi: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విరుచుకుపడ్డారు. అవినీతిపై పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారి హోదాతో సంబంధం లేదకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.
MK Stalin: తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల దాడి జరుగుతోంది. సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన ‘కచ్చతీవు’ ద్వీపాన్ని శ్రీలంకకు ఎలా అప్పగించిందనే వివరాలు వెల్లడైన తర్వాత, ప్రధాని నరేంద్రమోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న కొరకు మొత్తం ఐదు మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను తాజాగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న అవార్డులను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమానికి అనారోగ్య సమస్యల కారణంగా ఉప ప్రధానిగా చేసిన అద్వానీ హాజరు కాలేకపోయాడు. దాంతో నేడు ఆయన ఇంటికి వెళ్లి మరీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ భారతరత్నను LK అద్వానికి అందించారు. Also Read:…