Ajit Pawar: ఈ ఎన్నికలు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ మధ్య యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: ఈ లోక్‌సభ ఎన్నికలు కుటుంబ సంబధాల గురించి కాదని, ఇది ప్రధాని నరేంద్రమోడీకి రాముల్ గాంధీకి జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. పూణే జిల్లాలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన భార్య సునేత్ర తరుపున శనివారం ప్రచారం చేశారు. కన్హేరిలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అజిత్ పవార్, ఆ తర్వాత ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారానికి అజిత్ పవార్ కుమారులు పార్థ్, జై హాజరయ్యారు.
Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన ప్రియాంక సన్నిహితుడు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిని కొన్ని స్థానాల్లో బారామతి ఉంది. ఇది గత కొంత కాలంగా ఎన్సీపీకి కంచుకోటగా ఉంది. అయితే ఎన్సీపీ చీలిక తర్వాత ఈ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ పడటంతో దేశవ్యాప్తంగా ఈ స్థానం చర్చనీయాంశం అయింది.
ప్రచారంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. హనుమంతుడిని ప్రార్థించిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, ఎన్నికలు ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉండబోతున్నాయని అన్నారు. ఈ స్థానంలో సుప్రియా సూలేకి ఎన్సీపీ(శరద్ పవార్)-కాంగ్రెస్- శివసేన(ఉద్ధవ్) పార్టీలు మద్దతుగా నిలుస్తుండగా.. సునేత్రకి బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) మద్దతునిస్తున్నాయి. బారామతిలో మే 7న పోలింగ్ జరగబోతోంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?