Mallikarjun Kharge on PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు భయపడి మణిపుర్ వెళ్లలేదని, తమ నేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. భయపడే నేత దేశానికి మంచి చేయలేరని విమర్శించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రజలు ఏకమై పోరాడి మోడీ ని గద్దె దించాలని ఖర్గే పిలుపునిచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను శుక్రవారం విడుదల…
Nitish Kumar: లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చారు.
Katchatheevu: ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కచ్చతీవు దీవుల అంశం చర్చనీయాంశంగా మారింది. 1970లలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్కి చెందిన హిందూ మహాసముద్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది.
DMK: తమిళనాడు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార డీఎంకే, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా డీఎంకే వివాదాస్పద నేత ఏ.రాజా ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. భారత తొలి సీడీఎస్ దివంగత జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం ప్రధాని నీలగిరిని సందర్శించలేదని అన్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు.
అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభలో ఎన్నికలు జరగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ శ్రేణులకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలవాలని.. నిర్భయంగా ఓట్లు వేసేలా వారిని ప్రోత్సహించాలని కోరారు.
తైవాన్లో సంభవించిన భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బుధవారం తైవాన్లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.