Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవడంతో పాటు భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించడానికి రెండు రోజుల ( ఏప్రిల్ 21, 22 ) పాటు భారత్‌లో పర్యటించాల్సి ఉండగా.. ఈ పర్యటన వాయిదా పడినట్లు తమకు తెలిసిందని ఓ వార్త సంస్థ తెలిపింది.
Read Also: Gold Price Today : తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఇక, ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఎదురు చూస్తున్నానంటూ ఏప్రిల్ 10వ తేదీన ఎలాన్ మస్క్ ట్వీట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలిపారు. కొద్ది వారాల క్రితం భారత ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విధానాన్ని నోటిఫై చేయడంతో ఈ సందర్శన ప్రాముఖ్యత సంతరించుకుంది. కాగా, మస్క్ భారత్‌కు మద్దతుదారు అని, పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం పలుకుతున్నాం, భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కోరారు.
Read Also: INDIA : ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్న ఇండియా కూటమి.. రెడీగా ఏడు హామీలు
కానీ, ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదాకు తక్షణ కారణాలు ఇంకా వెల్లడించలేదు. ఏది ఏమైనప్పటికీ, టెస్లా మొదటి త్రైమాసిక పని తీరు గురించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఏప్రిల్ 23వ తేదీన యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే కీలకమైన కాన్ఫరెన్స్ కాల్‌కు ఎలాన్ మస్క్ హాజరు కావాల్సి ఉండటం వల్ల భారత దేశ పర్యటనను రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.