PM Modi: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రామ మందిర అంశాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకున్నాయని అన్నారు.
రైతులను ఆదుకొనే ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు.
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఒకే స్ట్రోక్తో దేశంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం స్పందించిన ప్రధాని మోడీ.. ఆయనను ‘‘రాజ మాంత్రికుడు’’ అని ఎద్దేవా చేశారు.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక, చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల సమయంలో ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన అతను, మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బందిన పంపిస్తానని హామీ ఇచ్చాడు.
MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860 రూపాయలు మాత్రమే.. ఇది 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఎస్పీఎంసీఐసీఎల్ఐ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు.
విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి విదితమేయ తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
ఇవాళ ఎంతో మంచి రోజు.. ఉత్తమ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్నాథ్ సింగ్ను అభినందిస్తున్నాను.. అలాగే, మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలిజేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.