Lok Sabha Elections: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు SBSP అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్వాదీ, కాంగ్రెస్లు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎన్డీయే మిత్రపక్షం ఓం ప్రకాష్ రాజ్భర్ ఉత్తరప్రదేశ్లోని లోక్సభ స్థానంలో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యాన్ని సమర్ధిస్తూ.. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్భర్ తెలిపారు. మరోవైపు.. బీజేపీ గెలుపు ఖాయమని కూటమి నేతలు దుబాయ్,…
స్టాక్ మార్కెట్లకు సరికొత్త ఊపు వచ్చింది. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మార్కెట్లకు ఊపిరి పోశాయి. ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారన్న పోల్స్ పల్స్ను బట్టి సూచీలు కొత్త జోష్ నింపాయి. ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి.
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు (ఆదివారం) ముఖ్యమైన అంశాలను కవర్ చేసే సుమారు 7 సమావేశాలను నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, రెమల్ తుఫాను అనంతర పరిస్థితిని సమీక్షించే సమావేశంతో ప్రారంభం కానుంది.
Congress : లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చింది.
Lok Sabha Election 2024 Exit Poll: ‘‘ఆబ్ కీ బార్ 400 పార్’’ బీజేపీ ఎన్నికల నినాదం, బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి 400+ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు నుంచి లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.