మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్‌రెడ్డికి అవకాశం దక్కగా.. తొలిసారి బండి సంజయ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కింది. ఇక పొత్తులో భాగంగా తెలుగు దేశానికి చెందిన ఇద్దరి ఎంపీలకు మోడీ కేబినెట్‌లో చోటు లభించింది. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా… కిషన్‌రెడ్డికి బొగ్గు, గనులు శాఖ, బండి సంజయ్‌కి హోంశాఖ సహాయ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శాఖలు దక్కాయి. బీజేపీ నుంచి ముగ్గురికి, టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది.
కేంద్రమంత్రుల ఎంపీ స్థానాలు ఇవే
సికింద్రాబాద్ – కిషన్‌రెడ్డి (బీజేపీ)
కరీంనగర్ – బండి సంజయ్ (బీజేపీ)
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు (టీడీపీ)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)
నరసాపురం – శ్రీనివాస వర్మ (బీజేపీ)