Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు మేము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు.
జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు.
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తు్న్నట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు రాద్దాంత చేయడంతో బిల్లుని పరిశీలించేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈరోజు గుజరాత్‌కు ప్రధాని మోదీ 8000 కోట్ల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. దీనితో పాటు, భారతదేశపు మొట్టమొదటి వందే మెట్రో భుజ్ నుండి అహ్మదాబాద్ వరకు ఫ్లాగ్ ఆఫ్ చేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుజరాత్ వెళ్లనున్నారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్లో పర్యటించనున్నారు చంద్రబాబు.. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనబోతున్నారు ఏపీ సీఎం.. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..
One Nation One Election: బీజేపీ హామీ ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’’ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత హాయాంలోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతో త్వరలోనే ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Sam Pitroda: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఇండియా టుడే రిపోర్టర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఫైర్ అయ్యారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు.