Canada–India Row: లావోస్‌లో నిర్వహించిన భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దీనిపై భారత్ రియాక్ట్ అయింది. ఇరువురి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. కేవలం వారిద్దరూ ఎదురు పడ్డారని భారత్ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీతో భేటీ అయినట్లు జస్టిన్ ట్రూడో తెలిపారు.
Read Also: Minister Ramprasad Reddy: వ్యాపారులను వేధిస్తే సహించేది లేదు..
అయితే, నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించానని.. ఇందులో భాగంగా తర్వాత చేయాల్సిన పనుల గురించి ప్రస్తావించినట్లు కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. కెనడియన్ల భద్రత, చట్టబద్ధ పాలనే తమ ప్రభుత్వ బాధ్యతలు.. వాటిపైనే దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఈ కామెంట్స్ ను భారత అధికారులు ఖండించారు. మోడీ, ట్రూడో ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు పలకరించుకున్నారు.. కానీ, వారి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు అని స్పష్టం చేశారు. కెనడాతో సంబంధాలను తాము గౌరవిస్తాం.. అయితే, అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా సర్కార్ కఠిన చర్యలు తీసుకునేంత వరకు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడం కష్టం అని భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.