Maulana Shahabuddin: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ప్రధాని నరేంద్రమోడీ దేశంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎంజే) జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ అన్నారు.
ఉగ్రవాదం మార్గదర్శకులకు సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి చెప్పామని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్టైక్స్‌తో శత్రుదేశాలకు భయం పుట్టించామని.. మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే దెబ్బలు తగులుతాయని అర్థం చేసుకున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ రెండో వారంలో భారత్‌లో పర్యటిస్తున్నారు. మాల్దీవుల అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోడీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్‌లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద భారతదేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక పురోగతి సాధనలో ఈ చర్య ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా…
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు అజెండాలు సృష్టించి.. ప్రచారం చేస్తుందన్నారు.
Aravind Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. తన పదవీ విరమణ సహా 5 అంశాలపై సమాధానం చెప్పాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.