ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.