1. నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో నగరంలో ఆంక్షలు విధించారు పోలీసులు. నేడు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
2. నేడు సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
3. నేడు ఒంగోలులో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
4. నేడు నెల్లూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే నెల 6,7 తేదీల్లో నడ్డా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించనున్నారు.
5. నేడు జ్ఞాన్‌వాపి వివాదంపై వారణాసి కోర్టు తీర్పు వెలువరించనుంది.
6. నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ నిరసన దీక్షలు చేపట్టనుంది.
7. నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్నారు.