ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్‌గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్‌లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే,…
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చగా మారాయి.. 'సాలు మోడీ.. సంపకు మోడీ' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో.. బైబై మోడీ అనే హాష్ ట్యాగ్‌ను రాసుకొచ్చారు.