రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతం పలికారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #Amaravati నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది.. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది.
రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.. నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు. మధ్యాహ్నం మూడున్నరకు అమరావతికి చేరుకోనున్న మోడీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. మోడీ సభకు 5 లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు..
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చేనెల 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు... ప్రధాని రాక కోసం పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం .. లక్షలాదిగా రైతులు, ప్రజలు తరలి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. సెక్రటేరియట్ వెనుక స్ధలంలో అతిపెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా…
ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు దారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమర్ యాదవ్, నాదెండ్ల మనోహర్.. కొల్లు రవీంద్ర సభ్యులుగా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసిన కూటమి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే సింది. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు ... ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని…