ఢిల్లీలోని ఎర్రకోటలో వరుసగా 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ అశాంతి సమయంలో దాడులను ఎదుర్కొన్న హిందువుల భద్రత గురించి 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు.
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు.
దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.