Lawrence Wong replace Lee Hsien Loong as Singapore PM: మే 15న సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సింగపూర్‌కు దాదాపు 20 ఏళ్లుగా పీఎంగా ఉన్న లీ సీన్ లూంగ్ ఆ బాధ్యతలు వీడనున్నారు. మే 15న ప్రధానమంత్రి పదవి నుంచి తాను దిగిపోనున్నట్లు లూంగ్ సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. లూంగ్ స్థానాన్ని ఉప ప్రధాని అయిన లారెన్స్ వాంగ్‌తో భర్తీ చేయనున్నట్లు సింగపూర్ ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Jhelum River-Boat: జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి! పలువురి గల్లంతు
ఉప ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్‌ను సింగపూర్ ప్రధానమంత్రిగా నియమించాలని రాష్ట్రపతికి ప్రధానమంత్రి కార్యాలయం లేఖ రాసింది. లేఖ రాసిన కొద్దిసేపటికే తాను ఈ పదవిని అంగీకరించినట్లు వాంగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. సింగపూర్ మూడో ప్రధానిగా లీ సీన్ లూంగ్ 2004 ఆగస్టులో ప్రమాణస్వీకారం చేశారు. లూంగ్ గతంలోనే పదవిని వీడాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి పరిస్థితులు, తదుపరి ప్రధాని ఎంపికలో జాప్యం కారణంగా ఆలస్యమైంది.