దేశ రాజధాని ఢిల్లీలో పావురాల రెట్టతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో పావురాల ప్రభావిత కేంద్రాలపై నిషేధం విధించడానికి ఆప్ సర్కార్ యోచిస్తోంది. పావురాల రెట్టల కారణంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది.
త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరిగింది.
ఇండియా కూటమి ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ లుకలుకలు వినపడ్డాయి. ఇంకోవైపు ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు.
రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషికి ఢిల్లీ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, ఆదాయానికి సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు విభాగాలు గతంలో కైలాష్ గెహ్లాట్ వద్ద ఉండేవి.