పాతతరం విమానాలను వియానాయ సంస్థలు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి. ఇలానే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్రయించారు. అలా విక్రయించిన విమానాన్ని ఢిల్లీలోని రహదారి గుండా తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఆ దృశ్యాలను కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవల నుంచి ఎయిర్…
కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అరకొరగా సాగుతున్నాయి. అనేక దేశాలు అంతర్జాతీయ సర్వీసులపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఇండియా- యూఏఈ మధ్య విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కరోనా కొంత మేర తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. అయితే, ఆగస్టు 5 వ తేదీన ఎయిర్ అరేబియా విమానంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కోసం…
ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి…
22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న రష్యాకు చెందిన విమానం ఇవాళ సముదంలో కుప్పకూలింది.. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా గల్లంతయ్యారు.. పెట్రోపవలోస్క్ నుంచి పలనాకు మొత్తం 28 మందితో బయల్దేరిన ఏఎన్-26 విమానాకి పలానా ఎయిర్‌పోర్ట్‌కు పదికిలోమీటర్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఇంకా కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందని అంతా భావిస్తున్న సమయంలో.. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు.…
వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలింది.. ప్రమాదం జరిగిన సమయంలో 92 మంది సిబ్బంది విమానంలో ఉన్నారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది రక్షించామని.. 17 మంది జవాన్లు మృతిచెందినట్టు గర్తించామని చెబుతున్నారు డిఫెన్స్ సెక్రటరీ.. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది జవాన్లు, సిబ్బందితో వెళ్లిన విమానం.. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది.. ఆ తర్వాత మంటలు చెలరేగాయి..…