కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అరకొరగా సాగుతున్నాయి. అనేక దేశాలు అంతర్జాతీయ సర్వీసులపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఇండియా- యూఏఈ మధ్య విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కరోనా కొంత మేర తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. అయితే, ఆగస్టు 5 వ తేదీన ఎయిర్ అరేబియా విమానంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కోసం షార్జా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానం వచ్చింది. ఆ విమానంలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లారు. కరోనా కారణంగా యూఏఈ లో వైద్యుల కొరత ఏర్పడింది. తెలంగాణకు చెందిన డాక్టర్ హర్షత ఇస్మాయిల్ హెల్త్ గ్రూస్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. లాంగ్‌టర్మ్ గోల్డ్ వీసా లేదని చెప్పి డాక్టర్ హర్షిత ఫ్యామిలీని ఆగస్టు 3 వ తేదీన వెనక్కి పంపారు. అయితే, వైద్యుల కొరత కారణంగా వీరిని ఆగస్ట్ 5 వ తేదీన ప్రత్యేక విమానంలో తిరిగి యూఏఈకి తీసుకెళ్లారు.
Read: ‘భళా తందనాన’… మళ్ళీ మొదలైంది!