వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం ఫిలిప్పీన్స్‌లో కుప్పకూలింది.. ప్రమాదం జరిగిన సమయంలో 92 మంది సిబ్బంది విమానంలో ఉన్నారని చెబుతున్నారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మంది రక్షించామని.. 17 మంది జవాన్లు మృతిచెందినట్టు గర్తించామని చెబుతున్నారు డిఫెన్స్ సెక్రటరీ.. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 92 మంది జవాన్లు, సిబ్బందితో వెళ్లిన విమానం.. సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది.. ఆ తర్వాత మంటలు చెలరేగాయి.. విమానం కూలడం.. వెంటనే మంటలు అంటుకోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్టుగా చెబుతున్నారు.. ఇక, విమానం శిథిలాల్లో చిక్కుకున్న మిగతావారి కోసం భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి.