Pawan Kalyan Plans House in Pithapuram: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం (జూన్ 3) స్థలం కొని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలను కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది. రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని.. పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొన్నారాయన. డిప్యూటీ సీఎంగా వారాహి మీద నుంచి తొలి ప్రసంగం చేశారు. తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా.. ఇదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు.
ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.