Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.. పిఠాపురంలో సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 21 మంది జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.. ఇక, నియోజకవర్గంలో 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆ ప్రత్యేక బృందాలకు ఆదేశాలు జారీ చేశారు.. సమస్యల పరిష్కారానికి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు..
Read Also: AP Government: శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్.. తక్కువ ధరకే వంట నూనె..
కాగా, పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ కల్యాణ్.. భారీ మెజార్టీతో తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజయం సాధించారు.. ఇక, డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కీలక శాఖలు దక్కించుకున్న ఆయన.. ఓవైపు తన శాఖలపై రివ్యూలు నిర్వహిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ పర్యటించారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి.. కొన్ని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన విషయం విదితమే.