Janasena : పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న జనసేన మొదటి సభ. అందుకే భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సభ వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభ వద్దకు వచ్చిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లాలని ప్రయత్నించారు. ఇంతలోనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది…