అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానం దక్షిణ కొరియాలో కూలిపోయింది. శిక్షణ సమయంలో విమానం ప్రమాదానికి గురైందని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం.. గన్సన్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. “సియోల్‌కు దక్షిణంగా 178…
Alaska Airlines: ప్రయాణికులను సురక్షితంగా తీసుకు వెళ్లాలని ప్రతి డ్రైవర్ అనుకుంటాడు. అలానే ఏదైనా ప్రమాదం సంభవిస్తే తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని భావించి ప్రయాణికులను వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాడు. అయితే ఈ పైలెట్ మాత్రం భూమి నుండి 31000 వేల అడుగుల ఎత్తులో గాల్లో దూసుకుపోతున్న విమానం ఇంజన్ ను ఆపటానికి ప్రయత్నించాడు. ఈ ఘటన అలాస్కా ఎయిర్ లైన్స్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఆదివారం వాషింగ్టన్ డీసీ నుంచి…
Pilot destroys parking barrier: చాలా మందికి చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోపంతో ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ లో ఉన్న పార్కింగ్ బ్యారి గేట్ ను గొడ్డలితో ఇరగొట్టాడు. ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పోర్ట్ లలో, విమానంలో వింత వింతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారు.…
ప్రమాదవశాత్తు గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతిచెందాడు. బాత్రుమ్ కు అని వెళ్లిని ఆ పైలట్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కో పైలట్ అలర్ట్ అయి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
Air India pilot refused to fly at Rajkot Airport: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తూ ఉండిపోయారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం విమాన పైలట్ తన డ్యూటీ అయిపోయిందని వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జూలై 23న రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఎయిరిండియా విమానంలో…
టైటానిక్ శిథిలాల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తున్న టైటాన్ జలాంతర్గామి పైలట్ భార్య వెండీ రష్.. 1912లో టైటానిక్ షిప్ ప్రమాదంలో మరణించిన దంపతుల మునిమనవరాలు.
ఈక్వెడార్‌లో ఓ పైలట్ కు వింత ఘటన ఏర్పడింది. పాపం అతని ప్రాణం పోతున్నా.. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా ఆండియన్ కాండోర్ అనే ఓ భారీ పక్షి ఢీకొట్టింది. విండ్ షీల్డ్ బాగా దెబ్బతింది. కాక్‌పిట్‌లో ఆ పక్షి ఇరుక్కుపోయినా, పైలట్ భయపడలేదు. పైలట్‌కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. అతడి ముఖం అంతా గాయాలై, రక్తం కారింది.
రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్ ఫ్రాన్స్‌లోని బహుళజాతి విన్యాసాల్లో పాల్గొంటారు. IAF బృందంలో మహిళా పైలట్ శివాంగి సింగ్ చోటు దక్కింది. ఆమె రాఫెల్ స్క్వాడ్రన్ కు చెందిన మొదటి మహిళా ఫైటర్ పైలట్.
Cobra on Plane: ఎక్కడైనా పాము కనిపించిందంటే పరుగులు పెడతారు.. అమ్మో పాము అంటూ హడలిపోతారు.. కొన్నిసార్లు వాహనాల్లోనూ పాములు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి.. వెంటనే ఆ వాహనాన్ని ఆపి.. దిగిపోవడానికి అవకాశం ఉంది.. కానీ, గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్‌లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన ప్రత్యక్షమైంది.. దీంతో ఆ పైలట్ హడలిపోయాడు.. కానీ, గందరగోళానికి గురికాలేదు.. ఆ పైలట్ చాకచక్యంగా…
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవా జిల్లాలో శిక్షణ విమానం కూలిపోవడంతో పైలట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.