ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి…