కీచకుల భరతం పడతాం.. ఏపీ మహిళా కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మహిళలు, మహిళా ఉద్యోగినులు, పాఠశాలల్లో విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే కీచక ఉపాధ్యాయుల భరతం పట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల వరుసగా జరిగిన వేధింపుల ఘటనలపై వాసిరెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. గుంటూరు రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడి ఆమె కేసు పూర్వాపరాలను తెలుసుకున్నారు.
తక్షణమే వాలంటీర్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించిన ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదని పోలీసులకు చెప్పారు. అదేవిధంగా గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్ లో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనపై గుంటూరు అర్బన్ పోలీసు అడిషనల్ ఎస్పీతో మాట్లాడి మహిళా కమిషన్ ఆరా తీసింది. విద్యార్ధినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల టీచర్ విషయంలో అరెస్టుతో పాటు భవిష్యత్తులో మరొకరు అలా ప్రవర్తించని రీతిలో కఠినమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరాచకపర్వంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏలూరు సబ్ రిజిస్ట్రార్ తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఏలూరు రిజిస్ట్రేషన్ డిఐజీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏలూరు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారని.. శాఖాపరమైన చర్యలపై అడగ్గా… తక్షణమే సబ్ రిజిస్టార్ డిప్యూటేషన్ ను రద్దు చేస్తున్నట్లు డిఐజీ సమాధానమిచ్చారన్నారు. మహిళలు, బాలికలకు జరుగుతున్న అన్యాయం, వేధింపులపై మహిళా కమిషన్ సత్వరమే స్పందిస్తుందని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!