శాసనమండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధాన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్ నిబంధనల ప్రకారం నడుచు కోలేదని, ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి మండలి చైర్మన్ వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీల హక్కుల కోసం…