Venugopala Krishna: పిల్లి సుభాష్‌కు మంత్రి వేణు కౌంటర్.. ఎవరి ట్రాప్‌లోనో పడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venugopala Krishna Strong Counter To Pilli Subhash Chandrabose: 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణుని అభ్యర్థిగా ప్రకటిస్తే తాను మద్దతు ఇవ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ట్ర తాజాగా కౌంటర్ ఇచ్చారు. బోస్ ఎవరి ట్రాప్‌లోనే పడి అలా మాట్లాడుతున్నారని తాను అనుకుంటున్నానని అన్నారు. బోస్‌తో ఉన్నవాళ్లే ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. బోస్ అలా మాట్లాడి ఉండకూడదని, అలా మాట్లాడరని తాను అనుకుంటున్నానని చెప్పారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఆయన్ను గౌరవించిందన్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పరోక్షంగా బోస్‌ని హెచ్చరించారు. పార్టీ అన్ని విషయాలూ పరిశీలిస్తోందని.. పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan: సీఎం జగన్.. ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
అంతకుముందు ఆత్మీయ సమావేశంలోనూ మంత్రి వేణు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు అవ్వదని తెలిసి, బోస్‌ను మంత్రిగా కంటిన్యూ అవుతావా? అని జగన్ అడిగారన్నారు. అయితే.. తాను రాజ్యసభకు వెళ్తానని బోస్ చెప్పారన్నారు. అనుచరులు వల్లే బోస్‌కి అపకీర్తి, మచ్చ వస్తోందని ఆరోపించారు. పార్టీకి నష్టం చేసే వాళ్ళని కచ్చితంగా దూరం పెడతానన్నారు. తల్లి లాంటి పార్టీను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బోస్ ఓడిపోయినప్పటికీ పార్టీ వదల్లేదని.. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి, రాజ్యసభ పదవుల్ని ఇచ్చారని గుర్తు చేశారు. తోట త్రిమూర్తులు, బోస్ ముందే వచ్చే ఎన్నికల్లో వేణు పోటీ చేస్తారని జగన్ చెప్పారన్నారు. తనకు, పిల్లికి, తోట త్రిమూర్తులకు వైఎస్ జగన్ ఎవరికి ఇవ్వాలని బాధ్యతలు వారికి ఇచ్చారన్నారు. తాను కేవలం 2024లోనే కాదు.. 2029, 2034లలో కూడా పోటీ చేస్తానని ఉద్ఘాటించారు.
Cab Driver: క్యాబ్ డ్రైవర్ పాడుపని.. డ్రైవింగ్ చేస్తూ మహిళ కళ్లెదుటే హస్తప్రయోగం
ఇదిలావుండగా.. 2024 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణు అభ్యర్థి అయితే, తాను సమర్థించనని పిల్లి సుభాష్ కుండబద్దలు కొట్టారు. వేణు బరిలో ఉంటే మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. తన కుటుంబంలో నుంచే ఎవరో ఒకరు పోటీ చేయాలని క్యాడర్ కోరుతోందని అన్నారు. తనకు క్యాడరే ముఖ్యమని, ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. వేణు ఆత్మీయ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. సమయం వచ్చినప్పుడు క్యాడర్ సమాధానం చెప్తుందన్నారు. క్యాడర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనన్నారు. పార్టీకి నష్టమైనా, తప్పడం లేదన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!