కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల లోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి లేదా…
యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.…
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఒక మంచి పేరుంది.. మావోయిస్టు కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ లకు మించి ఎవరు చేయలేరని చెప్తారు.. మావోయిస్టుపై ఆపరేషన్ చేయడం ఎన్కౌంటర్ చేయడం మావోయిస్టులో కీలక సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ..అయితే ఇవన్నీ చేయడానికి మావోయిస్టుల లోపటికి వెళ్లి వాళ్ళ సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ఫోన్లను వాళ్లకు సహాయాలు చేసేవారి ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఆమెరకు మావోయిస్టులపై తెలంగాణ పోలీస్…
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు…
యుద్ధం మొదలైంది.. ఎక్స్‌లో ఖమేనీ కీలక పోస్ట్ పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు వెల్లడవుతోంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మాక్రాన్…
‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్? గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జాతీయ అవార్డు గ్రహీత, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ నిర్మాత వెంకట…
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. నాకేం తెలీదని ప్రభాకర్ రావు అంటుంటే… ప్రభాకర్ రావు చెప్పిందే తాను చేశానని ప్రణీత్ రావు అంటున్నాడు !! దీంతో… ఇద్దరినీ కలిపి వాచారించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. అలా ఐతే కానీ.. అసలు బండారం బయటపడేలా లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా ప్రభాకర్ రావు పేరు చెప్తుంటే… ప్రభాకర్ రావు మాత్రం తెలీదు… గుర్తులేదు.. మరిచిపోయా… అంటూ సిట్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడట ! ఫోన్…
యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించి, అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్…