దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్‌ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
18 Pharma Companies To Lose Licenses Over Poor Quality Medicines: దేశవ్యాప్తంగా నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో మొత్తం 76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీసీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
World's Top 5 Pharma Companies: మన దేశానికి ఫార్మా రాజధాని హైదరాబాద్ అని చెబుతుంటారు. అందువల్ల తెలుగు ప్రజలకు ఈ ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువే అవగాహన ఉంటుంది. ఇండియాలోని టాప్ 5 ఫార్మా కంపెనీల పేర్లు ఈజీగానే చెప్పగలుగుతారు. అయితే ప్రపంచంలోని టాప్ 5 ఫార్మా కంపెనీలు ఏవి అని అడిగితే మాత్రం అందరూ సమాధానం చెప్పలేకపోవచ్చు. ఈ ఫీల్డ్‌లో పనిచేసేవాళ్లతోపాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఈ సమాచారం