కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతాారామన్ వెల్లడించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గనున్నాయి. ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై రూ. 200 వరకు సబ్సిడీని ప్రకటించారు.…
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు. 2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే…
జనం లేక ఈగలు తోలుకుంటున్నారు అన్న సామెతను మనం వింటుంటాం కదా.. ఇప్పుడు ఈ..పెట్రోల్ బంకులో అదే జరుగుతోంది.. కస్టమర్లు లేక వీళ్లు ఇదే పని చేస్తున్నారు.. ఒకళ్లిద్దరు వస్తే అదే మహా భాగ్యమని, దేవుళ్లు వచ్చారని ఫీలవుతున్నారు ఈపెట్రోల్ బంకు నిర్వాహకులు.. పెట్రోల్ ధరల దెబ్బకు ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. ఈ ఒక్క బంకే కాదు.. కర్నాటక సరిహద్దు ప్రాంతాలైన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, నియోజకవర్గాల్లోని మెజారిటీ బంకుల పరిస్థితి ఇదే.. తెలంగాణలో…
ఏపీలో విపక్షాలు మూకుమ్మడిగా అధికార వైసీపీపై మండిపడుతున్నాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజా ఉద్యమాల అంటే సీఎం జగనుకు అంత ఉలుకెందుకు..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయి. ఈ నెల 9న సీపీఐ ఛలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుండే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సీపీఐ, ప్రజా సంఘాల…
తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. ఒకవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతుంటే.. బీజేపీ నేతలు పాదయాత్ర చేయడాన్ని భట్టి తీవ్రంగా ఆక్షేపించారు. బండి సంజయ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఎవరి కోసం సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నావా..? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లోకి…
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వానికి వ్యాట్ సెగ తగులుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని విపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఎన్డీయే పాలిట ప్రభుత్వాలు ధరలు తగ్గించాయి. వ్యాట్ ని భారీగా తగ్గించాయి. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న చోట ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ డిమాండ్ తీవ్రత పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం…
అమరావతి : పెట్రోల్ ధరలపై తగ్గించకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.12 తగ్గించాయని… అస్సోం,…
దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్న వేళ ఉపశమనం కలిగించింది కేంద్రం. దీపావళి వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పై 5, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడంతో ధరలు దిగివచ్చాయి. ఈ తగ్గింపు ధరలు గురువారం ఉదయం నుంచి అమలులోకి…
పెట్రోల్ ధరల విషయంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో గురువారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అంతేకాకుండా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్లు తెలుస్తోంది. Read Also: పెట్రోల్ రేట్లను మరింత…