పెట్రోల్ ధరల విషయంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ పన్ను తగ్గించడంతో గురువారం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించింది. అంతేకాకుండా రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్లు తెలుస్తోంది.
Read Also: పెట్రోల్ రేట్లను మరింత తగ్గించిన తొమ్మిది రాష్ట్రాలు
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 చొప్పున తగ్గాయి. దీంతో లీటరు పెట్రోల్ లీటర్ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. లీటరు డీజిల్ ధర రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది. మరోవైపు ఏపీలోని విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.6.10 తగ్గి రూ.109.03కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.12.28 చొప్పున తగ్గి రూ.95.17కి చేరింది. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.