IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
- ముగిసిన రెండో రోజు ఆట..
- భారీ ఆధిక్యంలో టీమిండియా
- ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన టీమిండియా ఓపెనర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ తొలిరోజు 150 పరుగులకే పరిమితమైన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియాను 67 పరుగులకే 7 వికెట్లను పడగొట్టింది. ఇక నేటి రెండో రోజులో భారత్ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. 67 పరుగుల వద్ద రెండో రోజును మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను చావు దెబ్బ తీసాడు. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న హర్షిత్ రాణా 3 వికెట్లు, హైదరాబాదీ బౌలర్ సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో మిట్చెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Also Read: IND vs AUS: 21ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యశస్వి జైస్వాల్ – కేఎల్ రాహుల్ జోడి
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ఇక స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆస్ట్రేలియా బౌలర్లు టీమిండియా బ్యాట్స్మెన్స్ ను పలు ఇబ్బందులకు గురిచేసిన ఎంతో ఓపికగా ఇద్దరు బ్యాటింగ్ చేస్తూ రోజు ముగిసే సమయానికి వికెట్ పడకుండా 172 పరుగులను జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 62 పరుగులు, యశస్వి జైస్వాల్ 90 పరుగులతో అజేయంగా నిలిచారు. దీంతో టీం ఇండియా రెండో రోజు ఆటో ముగిసే సమయానికి 218 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జోడి పలు రికార్డులను నెలకొల్పింది. ఇకపోతే అప్టస్ స్టేడియంలో అతి పిన్న వయసుడిగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఇదివరకు ఈ రికార్డు ట్రావిస్ హెడ్ పేరు మీద ఉండేది.
That's Stumps on Day 2 of the first #AUSvIND Test!
A mighty batting performance from #TeamIndia! 💪 💪
9⃣0⃣* for Yashasvi Jaiswal
6⃣2⃣* for KL RahulWe will be back tomorrow for Day 3 action! ⌛️
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/JA2APCmCjx
— BCCI (@BCCI) November 23, 2024
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!