Jasprit Bumrah: 10 ఏళ్ల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్!
- స్టీవ్ స్మిత్ గోల్డెన్ డకౌట్
- బుమ్రా అరుదైన ఫీట్
- బుమ్రా సంచలన బౌలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్‌ను బుమ్రా మొదటి బంతికే అవుట్ చేశాడు. ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌట్ అయిన స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే అతడు రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.
అంతకుముందు స్టీవ్ స్మిత్‌ను దక్షిణాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. 2014లో గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్మిత్ రెండోసారి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. పెర్త్ మ్యాచ్‌లో బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా, ప్యాట్ కమ్మిన్స్‌ను అవుట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 17 పరుగులు ఇచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు.
Also Read
Also Read: Nitish Reddy: నా ఆరాధ్య దైవం నుంచి క్యాప్ అందుకోవడం ఆనందంగా ఉంది: నితీశ్ రెడ్డి
పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై డీలా పడ్డ భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా తన సంచలన బౌలింగ్‌తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్‌గా మరింత బాధ్యతలో బౌలింగ్ చేసిన అతడు తొలి రోజు చివరికి జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. ఆసీస్ బ్యాటర్లు ఎంత సన్నద్ధమై వచ్చినా.. బుమ్రా పేస్ ముందు తలొంచక తప్పలేదు. తొలి రోజు ఆట చివరికి ఆసీస్ 67/7తో నిలిచింది. అంతకుముందు భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!