Yashaswi Jaiswal: పెర్త్ టెస్టులో సెంచరీ సాధించిన జైస్వాల్.. ఏకంగా ఎనిమిది రికార్డులు..
- పెర్త్ టెస్టులో సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్
- ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ
- ఈ సెంచరీతో ఎనిమిది రికార్డులు సొంతం చేసుకున్న స్టార్ ఓపెనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ. ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ సిక్సర్‌తో ఈ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్‌లో యశస్వికి ఇది నాలుగో సెంచరీ.
పెర్త్ టెస్ట్ మూడో రోజు (నవంబర్ 24), యశస్వి జైస్వాల్ సెంచరీ చేసిన వెంటనే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. 205 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల బాదిన యువ ఆటగాడు.. ఈ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో కంపోజ్ చేసిన సెంచరీతో తన సత్తాను నిరూపించుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతికి పైర్ కట్ కొట్టడం ద్వారా అతను అద్భుతమైన శైలిలో ఈ ఫీట్ సాధించాడు. 22 ఏళ్ల జైస్వాల్ సెంచరీ చేసిన వెంటనే కేఎల్ రాహుల్ (77) ఔటయ్యాడు. అయితే వీరిద్దరూ ప్రత్యేక భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. యశస్వి ఈ సెంచరీతో 8 రికార్డులు క్రియేట్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకుందాం…
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
యశస్వి సాధించిన రికార్డులు..
- మొదటి 15 టెస్టుల్లో 1500+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు
- ఇన్నింగ్స్‌పరంగా అత్యంత వేగంగా 1500+ రన్స్ చేసిన రెండో భారత బ్యాటర్‌గా యశస్వి. 28 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని సాధించాడు. గతంలో పుజారా కూడా 28 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
- ఆస్ట్రేలియాలో ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు.
- ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు. అతడు 22 ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు)
- యశస్వి కంటే ముందు జైసింహా (1967-68), సునీల్ గావస్కర్ (1977-78) సాధించారు. ఈ ముగ్గురూ రెండో ఇన్నింగ్స్‌లోనే చేయడం గమనార్హం.
- 23 ఏళ్లు రాకముందే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన జాబితాలో యశస్వి ఐదో బ్యాటర్. ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అందరికంటే సునీల్ గావస్కర్ (1971లో 4 సెంచరీలు) సాధించాడు.
- భారత్ తరఫున 23 ఏళ్ల వయసులోపే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో బ్యాటర్ యశస్వి (4). సచిన్ అందరికంటే ఎక్కువగా 8 సెంచరీలు చేశాడు.
- ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై చివరిసారిగా సెంచరీ సాధించిన బ్యాటర్ కేఎల్ రాహుల్. 2014-15 సీజన్‌లో ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు యశస్వి సెంచరీ నమోదు చేశాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!