ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. యాషెస్ 2025-26లో భాగంగా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ (5/23) పడగొట్టడంతో ఈ రికార్డు స్టోక్స్ ఖాతాలో చేరింది. అంతకుముందు ఈ రికార్డు గుబ్బీ అలెన్ పేరిట ఉంది. అలెన్ 1936లో 5 వికెట్స్ పడగొట్టి 36 రన్స్ ఇచ్చారు. అలెన్ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు.
1990/91 తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ టెస్ట్‌లో రెండు జట్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. పెర్త్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 132 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 1990/91 యాషెస్‌లో భాగంగా గబ్బా టెస్ట్‌లో ఇంగ్లాండ్ 194 పరుగులకు, ఆస్ట్రేలియా 152 పరుగులకు ఆలౌట్ అయ్యాయి.
Also Read: Gambhir-BCCI: హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ!
ఇంగ్లాండ్ కెప్టెన్ల అత్యుత్తమ గణాంకాలు:
# 5/23 – బెన్ స్టోక్స్ , పెర్త్ 2025
# 5/36 – గుబ్బీ అల్లెన్, బ్రిస్బేన్ 1936
# 5/46 – జానీ డగ్లస్, మెల్బోర్న్ 1912
# 5/49 – ఫ్రెడ్డీ బ్రౌన్, మెల్బోర్న్ 1951
# 5/66 – బాబ్ విల్లిస్, బ్రిస్బేన్ 1982