ఆంధ్రప్రదేశ్ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. తాజాగా ఈ ఇద్దరు మంత్రులు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా, పవన్ ఫ్యాన్స్ అడ్డుకున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే… కృష్ణాజిల్లా, గుడివాడలో జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో “భీమ్లా నాయక్”ను ప్రదర్శిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఇద్దరు మంత్రులను…
ఏపీలో వినోదం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం టికెట్ల రేట్లపై హేతుబద్ధత తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా కమిటీ ఏర్పాటుచేసింది. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ సీఎం జగన్ తో చర్చించిన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విధానాలను ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో వివరించారు మంత్రి పేర్ని నాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో కానీ,…
రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ నెల 18న ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మోహన్ బాబు తెలియచేస్తూ, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ‘ఓ ఎమ్మెల్యే కారణంగా చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి, తనలాంటి అమాయకులు దేశ వ్యాప్తంగా జైళ్ళలో ఎంతమంది ఉన్నారనే విషయమై పరిశోధన చేసి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే ఈ చిత్ర కథ’ అని…
బొత్స సత్యనారాయణ ఇంటి వివాహ వేడుకలో ఏపీ మంత్రి పేర్ని నానిని తనను కలిశారని, వారి కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచానని, దాన్ని కూడా కొందరు చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు మండిపడ్డారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా…
2002, 2003 నుండి మోహన్ బాబుతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాఫీ కోసం పిలిస్తే వారి ఇంటికి వెళ్లానని, మాటల సందర్భంగా సినిమా వ్యవహారాలు చర్చకు వచ్చాయని, కానీ కొందరు దీనిపై కూడా దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న మోహన్ బాబు రానందుకు వివరణ ఇవ్వటానికి వెళ్లానని అంటున్నారని, అదేమీ కాదు, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన…
ఏపీల సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నేడు సినీ నటుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పేర్ని నాని తమ ఇంటికి రావాడాన్ని తెలుపుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలపై చర్చించడానికి విచ్చేసిన పేర్నినాని కృతజ్ఞతలు అన్నట్లుగా ఆయన ట్విట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..…
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అయ్యారు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ. హెచ్ఆర్ఏ, పెన్షన్ శ్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపుతో పడే ఆర్ధికభారంపై చర్చించారు. ఏడువేల 500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కమిటీ ముందు పెట్టిన ఇతర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు మంత్రుల కమిటీ. నిన్న రాత్రి వరకు ఉద్యోగులతో…
ఏపీలో సీఎం జగన్ తో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. పీఆర్సీ అంశాలు, ఉద్యోగుల నిరసనలపై చర్చించనుంది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకి సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయని భావిస్తున్నా అన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నా అన్నారు పేర్ని నాని. అనేక అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాం.ఆర్థికపరమైన విషయాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని…
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై గందరగోళం నెలకొంది. చరిత్ర ఇటువంటి పీఆర్సీ ప్రకటన చూడలేదని, న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే పీఆర్సీపై ఉద్యోగ సంఘాలను నచ్చజెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు పీఆర్సీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను ఈరోజు చర్చకు ఆహ్వానించింది. అయితే కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. అయితే…
కొడాలి నాని పై వస్తున్న గుడివాడ కేసీనో..టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంశం పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..ప్రతిపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. జగన్ ప్రభుత్వం ఎవ్వరికీ చుట్టం కాదన్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే ముఖ్యమంత్రి ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని అన్నారు. Read Also: దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు పూజరులు…