చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లుళ్ళ వల్ల మామలకు గిల్లుళ్ళు తప్పవు అంటూ ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హరీశ్ రావు అల్లుడు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు అని ఆరోపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంకల్పంతో పని చేసిన, బలమైన, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతిలో చంద్రబాబు దొరికిపోయారని ఆయన తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు.